
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
వెల్దుర్తి: క్రీడా స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శిరిగిరిపాడులోని వీరాంజనేయస్వామి తిరునాళ్ల పురస్కరించుకొని గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన పురుషులు, మహిళా వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు శుక్రవారం ఆయన బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఫైనల్ విజేతలుగా నిలిచిన ఎస్‌ఆర్‌ఎం పురుషుల జట్టుకు రూ.లక్ష , మెడల్స్, ట్రోఫీలను అందించారు. ఎస్‌ఆర్‌ఎం మహిళా విభాగం జట్టుకు రూ.లక్ష , ట్రోఫీ అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన ఐఓబీ పురుషుల జట్టు, సదరన్ రైల్వే మహిళా జట్టుకు రూ.75 వేలు, మెడల్స్, ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వెల్దుర్తి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు.
బదిలీల దరఖాస్తులో జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలపై శుక్రవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ప్రభుత్వం దాదాపు 770 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచటంలోనూ, విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచటంలోనూ యూటీఎఫ్ కార్యకర్తలు ముందుండాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు ప్రభుత్వ ఉత్తర్వులు, దరఖాస్తు పూరించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.మోహనరావు, గౌరవాధ్యక్షుడు షేక్ ఖాసీం పీరా, సహాధ్యక్షురాలు ఏ.భాగేశ్వరిదేవి పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి