
సమారాధనలో పాల్గొన్న సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట రూరల్: కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రాను న్న ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్, సహకార సలహాదారుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కోటప్పకొండ శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి సంఘీయుల కార్తిక వనసమారాధన ఆదివారం రెడ్లసత్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి, వైఎస్సార్‌సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధార్టీ చైర్మన్ ఈదా రాజశేఖర రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కులాలకు అతీతంగా పాలించే అర్హత ఉన్నవారిని రెడ్డి అని పిలుస్తారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘీయుల వెంట ఇతర కులాల నడుస్తున్నాయని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పేదలకు, బడుగు, బలహీ న వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం జగన్ వైఎస్సార్ సీపీకి బలమైన పునాదులు వేశారని, దీనిని సద్వినియోగం చేసుకొని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో అద్భుతమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని తెలిపారు. ప్రతి గ్రామంలో సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి పథకాలు మనకు కనిపిస్తాయన్నారు. 30 సంవత్సరాలు రాజకీయాలు చేయాలనే తలంపుతో సీఎం జగన్ పని చేసుకుపోతున్నారని దీనిని నాయకులు అర్ధం చేసుకోవాలని కోరారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలను మరిచి ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వన సమారాధనకు దాదాపు 20 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, రెడ్లసత్రం అధ్యక్షుడు కామిరెడ్డి నర్సిరెడ్డి, కార్యదర్శి ఈశ్వరరెడ్డి, వన సమారాధన కమిటీ సభ్యులు సానికొమ్ము సుబ్బారెడ్డి, గెల్లి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు కోలాహలంగా రెడ్డి సంఘీయుల కార్తిక వనసమారాధన

హాజరైన రెడ్డి సంఘీయులు