
భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి
● ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి ● తరలివచ్చిన భక్తులు
చిలకలూరిపేట: హనుమత్ జయంతిని గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. చికలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంతోపాటు పెద్దకోట సెంటర్, పోలిరెడ్డిపాలెం, మారెళ్లవారివీధి తదితర చోట్ల ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామి వారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.
ప్రత్యేక అలంకరణలో
ప్రసన్నాంజనేయస్వామి