
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
వైభవంగా హనుమజ్జయంతి
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైఖానస శాస్త్రానుసారంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండో రోజు ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా పదివేలకు మందికి పైగా భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నట్లు మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన లక్ష్మణ్ రెడ్డి స్వామి బృందం భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
రెండో రోజు కార్యక్రమాలకు పదివేల మందికిపైగా భక్తుల రాక శోభాయమానంగా సాగుతున్న జయంతి ఉత్సవాలు
వేడుకలకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి హాజరు శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
నరసరావుపేట: హనుమజ్జయంతి పర్వదినం సందర్భంగా గురువారం వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు రామిరెడ్డిపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజారుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారితోపాటు పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రెటరీ పడాల చక్రారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు పల్లెర్ల మల్లికార్జునరెడ్డి, నాయకులు కంజుల రామకోటిరెడ్డి, పొలిమేర వెంకటరెడ్డి, అచ్చి శివకోటి, సాంబిరెడ్డి, కాకుమాను మంగపతిరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు

వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు

వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు