
యోగా కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్, ఎస్పీ
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా నుంచి పల్నాడు బస్టాండ్ రోడ్డు మధ్యలో ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నెలరోజులపాటు యోగా చేసేందుకు అనువైన స్థలం ఎంపికకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి గురువారం పరిశీలించారు. యోగ నిర్వహించే సమయంలో వాహనాల రాకపోకలను వేరే దారికి మళ్లించాలని కలెక్టర్ సూచించారు. యోగాలో పాల్గొనే వారికి అసౌకర్యం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంద్ర కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే.
అన్న క్యాంటీన్ తనిఖీ
అదే మార్గంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్, ఎస్పీలు తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఏర్పాటుచేసిన భోజన సదుపాయాలను రుచి చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారం తీసుకుంటున్న పలువురు ప్రజలను పలకరించి క్యాంటీన్ వసతులు, ఆహారం నాణ్యత గురించి తెలుసుకున్నారు. రోజుకి ఎంత మందికి టిఫిన్, భోజనానికి అందిస్తున్న వివరాలు సేకరించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, ఆర్డీఓ కె.మధులత, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.