
నా భర్తకి ఏమైనా జరిగితే మాకు దిక్కెవరు?
నేను, నా కుమారుడు హరికృష్ణ టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తెలంగాణలో ఉంటున్నాం. పండక్కి ఇంటికి వస్తే పోలీసులు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏ కారణం లేకుండా నా బిడ్డని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని తప్పుడు కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు రాజ్యాంగం అమలు చేయకుండా టీడీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు.
–ఉప్పుతోళ్ల యల్లయ్య, హరికృష్ణ తండ్రి
నా భర్త హరికృష్ణ ఏ తప్పు చేశాడని పోలీస్‌స్టేషన్‌కి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుడు జానీబాషా చెప్పడని నా భర్తని తెచ్చామని పోలీసులు మాతో అన్నారు. జానీబాషా కారులోనే నా భర్తని తెచ్చారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు తల్లిదండ్రులు కూడా లేరు. నా భర్తకు పోలీసులు, టీడీపీ నాయకుల వలన ఏమైనా జరిగితే నేను, నా పిల్లలు విషం తాగి చచ్చిపోతాం. నా భర్త నోట్లో గుడ్డలు పెట్టి పోలీసులు కొట్టారు.
–ఉప్పుతోళ్ల భార్గవి, హరికృష్ణ భార్య
దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు

నా భర్తకి ఏమైనా జరిగితే మాకు దిక్కెవరు?