
నడవలేని స్థితిలో హరికృష్ణ
వైఎస్సార్ సీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లోని సీఐ క్వార్టర్‌లో ఉంచారు. హరికృష్ణపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తెలుస్తోంది. తంగెడ నుంచి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కి చేరుకోగా నడవలేని స్థితిలో సీఐ క్వార్టర్‌లో పడి ఉన్న కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కుటుంబసభ్యులు స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్వార్టర్‌లో ఉన్న తమ కుమారుడిని చూపించాలని అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలతోపాటుగా హరికృష్ణ తల్లిదండ్రులు కోరారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. క్వార్టర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.