చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

రాయగడ: విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా శ్రద్ధతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రామనగుడలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల ప్రిన్సిపాల్‌ గౌరీప్రసాద్‌ పండా అన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నూతన విద్యార్థలకు ముందుగా స్వాగతం పలికిన ఆయన క్రమశిక్షణ, విద్యార్థుల బాధ్యతలపై వివరించారు. కార్యక్రమానికి పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కిశోర్‌ చంద్ర బెహర, మాజీ అధ్యక్షుడు సూర్యారావు కుంబ్రికలు అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల సమయ పట్టిక, యూనిఫారం,ఐడీ కార్డులు, ర్యాగింగ్‌ రహిత క్యాపంస్‌, పాఠ్యాంశాలు, పరీక్షా విధానం, ఈ బుక్స్‌ తదితర విషయాలపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement