జయపురం: జాతీయ స్థాయి నెక్ట్స్ జెన్ ఐకానిక్ మిస్ ఇండియా–2026గా జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి యువతి ఎన్.త్రిష తన్య ఎన్నికయ్యారు. జాతీయ స్థాయి నెక్ట్స్ జెన్ ఐకానిక్ మిస్ ఇండియా–2026 పోటీల్లోని డ్యాన్స్, వాక్, టాలెంట్, ప్రశ్న–జవాబులు, జాతీయ సంప్రదాయ వస్త్రధారణ వంటి పోటీలు రాజస్థాన్‌లోని జైపూర్, లక్నో, పూణెలలో జరిగాయి. ఫైనల్ దశ పోటీలు మూడు దినాలు ఉత్తర ప్రదేశ్ లక్నోలో జరిగాయి. ఫైనల్ పోటీల్లో ఫైనల్ పోటీకి నిలిచిన వివిధ రాష్ట్రాల నుంచి 24 మందిలో జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మకు చెందిన ఎన్.త్రిష తన్య మిష్ ఎక్ట్రా ఆర్డనరీ, బెస్ట్ టేలెంట్ టైటిల్ గెలుచుకుంది. ఆమె బొరిగుమ్మలో ఉపాధ్యాయుడు ఎన్.రాజేష్ కుమార్, గాయిత్రిల పెద్ద కుమార్తె.ఎన్.త్రిష తన్య మంచి రచయిత్రి, ఇంగ్లిష్‌లో పీజీ చేశారు.


