ఎమ్మెల్యే అశోక్‌కు నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అశోక్‌కు నిరసన సెగ

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

కంచిలి: ఇచ్చాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌కు కంచిలిలో నిరసన సెగ తగిలింది. స్థానిక గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన వచ్చి, తిరిగి వెళ్తుండగా మెయిన్‌రోడ్డులోని ఎస్‌బీఐ కూడలిలో స్థానికులు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను వివరించారు. రోడ్డు మరమ్మతులకు గురవ్వడంతో చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఏళ్లు గుడుస్తున్నా ఈ సమస్యపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే అశోక్‌ బదులిస్తూ త్వరలోనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించినవారిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు సునీల్‌ రాథోడ్‌, స్థానిక మహిళలు ఉన్నారు.

ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ప్రశ్నిస్తున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement