భువనేశ్వర్: పలు ప్రాంతాల్లో నదులు గరిష్ట నీటి మట్టం అధిగమించి ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతున్న ఇప్పటివరకు ఏ జిల్లా నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, స్థానిక వరద పరిస్థితులను ఎదుర్కోవడం, నిరంతరాయంగా అత్యవసర సేవలు అందించడం, సహాయక చర్యలు చేపట్టడం వంటి ఏర్పాట్లను జిల్లా యంత్రాంగాలు పటిష్టంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. స్థానిక లోక్ సేవా భవన్ రెవెన్యూ సమావేశం హాలులో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా యంత్రాంగాలూ నిరంతర అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. ఎలాంటి పరిస్థితికై నా తక్షణమే స్పందించేలా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. మానవ ప్రాణాల రక్షణే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి వండిన ఆహారం, పొడి రేషన్, సురక్షిత తాగు నీరు, ఆశ్రయం, ఇతర అత్యవసర సహాయక చర్యలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మయూర్‌భంజ్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రాపడా, కెందుఝర్, బాలేశ్వర్, భద్రక్, కలహండి, సుందరగడ్ వంటి అనేక జిల్లాల కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు, ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాలొన్నారు. జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రాల (డీఈఓసీ) సమన్వయంతో రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్‌ఈఓసీ) వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. ఈ నెల 1 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో సమగ్రంగా 517.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత సీజన్ సగటు కంటే 75.7 శాతం అధికంగా మంత్రి పేర్కొన్నారు.


