కేసులను వెంటనే పరిష్కరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

కేసులను వెంటనే పరిష్కరిస్తున్నాం

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీ ప్రశాంత భూపతి

పర్లాకిమిడి: జిల్లాలో సైబర్‌ మోసాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, వయోవృద్ధులకు సంబంధించిన కేసులు పోలీసు ష్టేషన్‌లో త్వరితగతిన పరిష్కారం వంటి అనేక సమస్యలపై మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీ ప్రశాంత భూపతి అడిగి తెలుసుకున్నారు. పర్లాకిమిడి పోలీసు ష్టేషన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇసెస్పెక్టర్‌ వాల్మీకి ప్రధాన్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం కార్యదర్శి రామచంద్ర పాడీ, తదితరులు పాల్గొన్నారు. పోలీసులంటే ఒకప్పుడు ప్రజల్లో వ్యతిరేక భావం ఉండేదని, ప్రస్తుతం ప్రజలు ఫిర్యాదుల చేయడానికి స్టేషన్‌కు వస్తుండటం సంతోషించే విషయమన్నారు. ప్రస్తుతం పట్టణంలో డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ చర్యలు చేపడుతున్నామన్నారు. సెంచూరియన్‌ వర్సిటీ, రాణిపేట, ఆంధ్రప్రదేశ్‌ సరిహాద్దు వద్ద హెల్మెట్‌ చెకింగ్‌ చేస్తున్నామన్నారు. కొందరు నోఎంట్రీ బోర్డు ఉన్నా వాగ్వివాదానికి దిగుతున్నారని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో నెలకు 30 నుంచి 40 కేసులు రిజిస్టర్‌ అవుతున్నాయన్నారు. ఎక్కువగా సరిహద్దు ఆంధ్ర నుంచి సాయంత్రం పర్లాకిమిడికి మద్యం సేవించడానికి ఎక్కువగా వస్తున్నారన్నారు. పట్టణంలో 28 చోట్ల సీసీ కెమెరాలు అమర్చడం వల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు అమర్చాలని సీనియర్‌ సిటిజన్లను ఐఐసీ కోరారు. సీనియర్‌ సిటిజన్లు ఉంచిన పలు సమస్యలను జిల్లా ఎస్పీ మీనా దృష్టికి తీసుకువెళ్తానని ఐఐసీ అన్నారు. ఈ సమావేశంలో మనోజ్‌ దాస్‌, విశ్రాంత అధ్యాపకులు శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement