మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రం ఎనిమిదో వార్డు పరిధిలోని తారణీ ఆలయ వీధిలో అలజడి చేస్తూ సామగ్రిని నాశనం చేస్తుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు కోతుల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మల్కన్‌గిరి రేంజర్ రమేశ్ చంద్రరౌత్ మాట్లాడుతూ.. ఈ విషయంపై త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలి
కొరాపుట్: నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడిన దివంగత విద్యార్థులకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న గాంధీ జంక్షన్ వద్ద గాంధీ బొమ్మ ముందు సంస్మరణ కార్యక్రమం సోమవారం జరిగింది. నీట్ పరీక్ష పత్రం లిక్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఫొటోలు పెట్టి కొవ్వోత్తులతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో విద్యార్ధి కాంగ్రేస్ నాయకుడు సూరజ్ లాల్,విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గోన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక కొత్తవీధిలో నివసిస్తున్న కొనపల రాజశేఖర్ ఈ జంక్షన్ వద్ద ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. కస్టమర్‌కి అవసరమైన వస్తువులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా.. పాతపట్నం ఎల్‌హెచ్ ఆర్టీసీ బస్సు నరసన్నపేట టౌన్‌లోకి వస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
భర్తకు భార్య తలకొరివి
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బైపల్లి యాదవరావు (60) సోమవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. అతని కుమారుడు కాళీప్రసాద్ కొద్ది నెలల క్రితం బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లాడు. దీంతో భార్య తులసమ్మ మానసికస్థితి బాగోలేకున్నా భర్తకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.
డివైడర్‌ని ఢీకొని యువకుడు మృతి
నరసన్నపేట/పోలాకి: స్థానిక బైపాస్ సర్వీసు రోడ్డుపై శ్రీకాకుళం నుంచి జమ్ము వైపునకు వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోలాకి మండలం బెలమర పోలవలసకు చెందిన గేదెల శ్రీకాంత్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రి పనిపై శ్రీకాకుళం వెళ్లి ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన స్నేహితుడు తుంగాన సురేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనం వెనుక కూర్చున్న శ్రీకాంత్ ఎగిరి డివైడర్‌పై పడగా తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన చోట ఇసుక ఉండడంతో ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్‌కు శ్రీకాకుళం వద్ద మొపసుబందర్‌కు చెందిన యువతితో గత నెల 21వ తేదీన వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త ఇలా మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అందివచ్చి న కుమారుడు ఇలా దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు ఆనంద్, విజయలక్ష్మి రోదనలు చూపరులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. గ్రామంలోనే కేబుల్ ఆపరేటర్‌గా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. ప్రమాదంపై నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం నడుపుతున్న సురేష్‌తో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


