● వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

● వినతుల వెల్లువ

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు స్పందన లభించింది. జిల్లా కలెక్టర్‌ అక్షయ్‌ సునీల్‌ అగర్వాల్‌ అధ్యక్షతన జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌కు జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ సహాయ్‌ మీనా, జిల్లా పరిషత ముఖ్యకార్యనిర్వాహణ అధికారి దయామయ పాడీ, తదితరులు హాజరయ్యారు. 89 వితనతులు అందాయి. వీటిలో 21 వినతులను కలెక్టర్‌ పరిష్కరించారు. ఒక నిస్సహాయ వ్యక్తికి రెడ్‌ క్రాస్‌ సహాయ నిధి నుంచి రూ. 20 వేల చెక్కును కలెక్టర్‌ అందజేశారు. గ్రీవెన్స్‌కు గుమ్మా సమితి చైర్మన్‌ సునేమీ మండల్‌, బీడీఓ దులారాం మరాండి, తహసీల్దార్‌ శరత్‌ శోబోరో, తదితరులు పాల్గొన్నారు.

52 వినతుల స్వీకరణ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కామ్‌బేడ పంచాయతీలో జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాఽథ్‌ ప్రధాన్‌ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. 52 వినతులు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వినోద్‌ పటేల్‌, జిల్లా అటవీశాఖ అధికారి సాయి కిరణ్‌, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దూర్యోధన్‌ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, సపితి అధికారులు, సర్పంచ్‌లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement