పట్టాలు తప్పిన గూడ్స్‌ వ్యాగన్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ వ్యాగన్‌

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

భువనేశ్వర్‌: బొలంగీర్‌ జిల్లాలోని టిట్లాగఢ్‌ సమీపంలో బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్‌ రైలు సోమవారం ఉదయం వ్యాగన్‌ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. బొలంగీర్‌ నుంచి టిట్లాగఢ్‌ వైపు గూడ్స్‌ రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తూర్పు కోస్తా రైల్వే సంబల్‌ పూర్‌ మండలంలో గూడ్స్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది. బొగ్గు రవాణా చేస్తుండగా సికిర్‌, టిట్లాగఢ్‌ స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్‌ నుంచి 14వ వ్యాగన్‌ వెనుక ట్రాలీ చక్రం పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంటాబంజి నుంచి ప్రమాద సహాయక రైలు సంఘటన స్థలానికి చేరి సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement