వచ్చే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

వచ్చే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

పర్లాకిమిడి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ కనీస వసతులు లేని గ్రామాలు ఒడిశాలో గజపతి జిల్లాలో ఉన్నాయి. వాటిలో గుమ్మసమితి పరిడా పంచాయతీలో లోబగుడ, రామంగో గుడ, సెంట్రీగుడ, కొండూరు గుడ వంటి నాలుగు గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో దాదాపు 600 మంది జనాభా నివసిస్తున్నారు. గుమ్మా బ్లాక్‌ నుంచి రహదారి సౌకర్య లేకపోవడంతో అనారోగ్యానికి గురైన సమయంలో జిల్లా మెడికల్‌కు తీసుకురాలేకపోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. మా గ్రామాలకు రహదారి వేయకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహికి ఇదే ఆఖరియత్నంగా తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement