శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని టెన్నిస్ కోర్టులో ఆదివారం జిల్లాస్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. శ్రీకాకుళం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–16 (బాలబాలికలు), సీనియర్స్ పురుషు లు, మహిళలు, 35+ పురుషులు మహిళలు ఇలా.. ఆరు విభాగాల్లో పోటీలు జరిగాయి. పోటీలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి. చీఫ్ కోచ్ అనీల్‌కుమార్, కోచ్ శంకరరావు పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ ద్వారా ప్రతి విభాగంలో ఎంపిక చేసిన జిల్లా టాప్–5 ర్యాంక్ క్రీడాకారులు.. సెప్టెంబర్ 2026లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లలో శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వీఎస్‌ఆర్‌కె నేతాజీ తెలిపారు. మొత్తం ఆరు వయో విభాగాల్లో ప్రతి క్యాటగిరీలో విన్నర్స్, రన్నర్స్‌కు ట్రోఫీలు, ప్రాతినిధ్యం వహించిన ప్రతిఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.


