దేవశైనీ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో రాజవీధిలో మవుసీ (పిన్నిగారు) ఇంట్లో విడిదిచేసిన శ్రీజగన్నాధ, బలభధ్ర, సుభధ్రలు భక్తుల మొక్కులను స్వీకరించారు. మహిళలు ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి వర్షం పడుతున్నా ఆ దేవతామూర్తులను దర్శించుకుని ఉపవాసాలు పాటించారు. చట్టు పక్కల గ్రామాల నుండే కాక పాతపట్నం, చాపర, మెళియాపుట్టి, వసుంధర గ్రామాల నుంచి భక్తులు రావడంతో రాజవీధిలో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీజగన్నాథుడు, నాగార్జున రూపంలో, బలభధ్రుడు, సుభధ్రలు సునాబేషో (బంగారు ఆభరణలుతో) భక్తులకు దర్శనం కల్పించారు. సునాభేషో సంధర్భంగా పోలీసుబలగాలు భధ్రత కట్టుదిట్టం చేశారు.
పర్లాకిమిడి


