మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి యం.వి 79 గ్రామం వద్ద పోలీసులు బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో వ్యాన్ అతివేగంగా రావడంతో దానిని అపి తనిఖీ చేశారు. డ్రైవర్ పరిపోడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు. వ్యాన్‌లో తనిఖీ చేయగా గంజాయి బస్తాలున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గంజయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం యంవి 79 పోలీసు స్టేషన్ వద్ద గంజాయిని తూకం వేశారు. 452 కేజీలు ఉందని, దీని విలువ రూ.60 లక్షలు వరకు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి విచారించారు. గంజాయిని ఛత్తీష్‌గఢ్ రాష్ట్రానికి తరలిస్తామన్నారు. సుభ్రత్ బిశ్వస్ కలిమెల సమితి యం.వి 80 గ్రామానికి చెందిన వాడని తెలిసింది. వైద్య పరీక్షలు అనంతరం కోర్టుకు తరలిస్తామని తెలిపారు.


