పర్లాకిమిడి: దశవతారాల్లో చివరిదైన కల్కి అవతారంలో గురువారం జగన్నాథుడు భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లని గుర్రంపై కత్తిపట్టుకున్న కల్కి అవతరాన్ని భక్తులు దర్శించుకున్నారు. బలరాముడు కూడా నల్లని గుర్రంపై కనిపించారు. సత్యయుగంలో కల్కి అవతారంలో విష్ణువు వచ్చి అధర్మాన్ని పారద్రోలి, దుష్టలను శిరచ్చేధనం చేయడం వంటి అవతారపురుషుని కథ గరుడ పురాణాల్లో ఉంది. కల్కి అవతారంలో ఆయన పక్కన పద్మాదేవి ఉండటం గమనార్హం. శుక్రవారం బహుడా యాత్ర జరుగుతుంది. రథాలను మందిరానికి దైతాపతులు మార్చడం జరుగుతుంది.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని బొయిపరిగుడ సమితి ఫ్రెండ్స్ యూనిట్ క్లబ్ సభ్యులు అన్నారు. జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి కొల్లార్ గ్రామ యువకులు రథయాత్ర పురస్కరించుకొని బొయిపరిగుడ ఫ్రెండ్స్ యూనిట్ క్లబ్ సభ్యులు, కొల్లార గ్రామ పంచాయతీ యువత, సంబాద్ ఒడియా దినపత్రిక సంయుక్తంగా ఆ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈరోజు ఒక మొక్క నాటితే అది రేపటిని రక్షిస్తుందన్నారు. జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
చెట్టును ఢీకొన్న థార్ కారు
● ముగ్గురు మృతి
భువనేశ్వర్: కెందుఝొర్ జిల్లాలోని చంపువా సమీపంలోని రాజియా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో థార్ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మంది మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చంపువా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


