మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దుంగయాపూట్ పంచాయతీ దుర్కాజోడి గ్రామానికి చెందిన డంబరు ఒడ (35) వ్యక్తి గ్రామస్తులతో కలిసి బుధవారం మధ్యాహ్నం సమయంలో చేపల వేటకు నదికి వెళ్లారు. నీరు ఎక్కువగా ఉండడంతో పడవ అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించినా దొరకలేదు. మాత్తిలి అగ్నిమాపిక సిబ్బందికి గురువారం సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాలికి చేరుకుని గాలించారు. రాళ్లచాటున చిక్కుకున్న మృతదేహాన్ని తీశారు. ఈ విషయం తెలుసుకున్న మాత్తిలి ఐఐసీ దీపాంజాలి ప్రధాన్, సమితి సభ్యరాలు లక్ష్మీప్రియ నాయక్, ఇద్దరు గ్రామానికి వెళ్లి మృతుడు కుటుంబ సభ్యులతో చర్చించారు. కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.


