రాయగడలో కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రాయగడలో కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

రాయగడ: దేశంలో వరుసగా జరుగుతున్న వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌ ఘటనలు, విద్యావ్యవస్థలో అవినీతిని నిరసిస్తూ ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు స్థానిక కపిలాస్‌ కూడలి వద్ద బుధవారం డీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్‌ ప్రధాన్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీక్‌లతో పాటు మెడికల్‌ సీట్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేసిందని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీక్‌ల నుంచి మెడికల సీట్ల వరకు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర మంతటా కాంగ్రెస్‌ నిరసనలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, యువ త తమ హక్కుల పరిక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికసంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement