పకడ్బందీగా మారు రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మారు రథయాత్ర

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

భువనేశ్వర్‌: ఈ నెల 24న జరగనున్న జగన్నాథుని మారు రథయాత్ర (బహుడా) సన్నాహాలపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝీ బుధవారం లోక్‌ సేవా భవన్‌లో సమీక్షించారు. రథయాత్ర నుంచి ఇప్పటి వరకు జగతినాథుని సేవాదులు అన్ని దాదాపుగా సక్రమంగా అమలు చేశారని, భారీ వర్షం, ప్రతికూల వాతావరణం, ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ భక్తుల తాకిడి, అధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం ఏమాత్రం సడలిపోలేదని ముఖ్యమంత్రి అభినందించారు. పొహండి, రథయాత్ర , దక్షిణ మోడొ, అడపా మండప దర్శనాలను పర్యవేక్షణలో ఉన్నతాధికారుల నిరంతర కృషి యాత్ర చిట్ట చివరి వరకు స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని కోరారు. మారు రథ యాత్రలో జన సమూహ నిర్వహణ, నిరంతర సమాచార ప్రసారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సమస్యాత్మక పరిస్థితుల సత్వర పరిష్కారానికి సీసీటీవీ నుంచి పొందిన సమాచారాన్ని సమీకృత కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా సద్వినియోగపరచుకోవాలన్నారు. శ్రీ మందిరం ముఖ్య నిర్వాహకుడు డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ పాఽఢి, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వై.బి.ఖురానియా, అగ్ని మాపక దళం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సుధాంశు షడంగి రథ యాత్ర నిర్వహణ వివరించారు.సమావేశంలో న్యాయ, పనుల శాఖ మంత్రి పృథ్వి రాజ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్‌ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్‌, అభివృద్ధి కమిషనర్‌ డీకే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement