–8లోu
● రథాల దక్షిణ మలుపు పూర్తి
● శారదా బాలి వద్ద పటిష్ట ఏర్పాట్లు
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు, విద్యావ్యవస్థలో అవినీతిని నిరసిస్తూ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు
నగదు : రూ. 2,20,010
వెండి : 4 గ్రాముల 800 మిల్లీ గ్రాములు
– భువనేశ్వర్/పూరీ
భద్రతా వలయం మధ్యం దక్షిణం వైపు మలుపు తిరుగుతున్న జగన్నాథుని నందిఘోష్ రథం
భువనేశ్వర్: బహుడా యాత్రకు ముందుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల మూడు రథాలను విజయవంతంగా దక్షిణ దిశగా మళ్లించారు. శ్రీ మందిరానికి అభిముఖంగా శ్రీ గుండిచా ఆలయం నక్కొచొణ ద్వారం ముంగిట నిలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ప్రారంభమైన ఈ ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. తొలి రోజున దేవీ సుభద్ర దేవ దళన రథాన్ని విజయవంతంగా మలుపు తిప్పి గుండిచా ఆలయ నక్కొచొణ ద్వారం సమీపంలో నిలిపారు. బలభద్రుని తాళ ధ్వజ రథం, శ్రీ జగన్నాథుని నందిఘోష రథాలను తిప్పడాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం తాళ ధ్వజ రథాన్ని దక్షిణం వైపు మళ్లించారు. దాని వెనుకే నందిఘోష రథాన్ని కూడా నక్కొచొణ ద్వారం వైపు తరలించారు. మూడు రథాలు దక్షిణం వైపునకు తిరిగి స్వామి మారు రథ యాత్రకు సిద్ధం కావడంతో త్వరలో రథాల సాంకేతిక తనిఖీ నిర్వహించి పటిష్టత పర్యవేక్షిస్తారు. శారదా బాలి వద్ద రథాలకు బారికేడ్లు, పటిష్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.
ప్రత్యేక ఆకర్షణగా నక్కొచొణ ద్వారం..
గుండిచా ఆలయంలోని నక్కొ చొణ ద్వారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ద్వారం గుండా బహుడ రోజున దేవతామూర్తుల మూల విరాటులు అడపా మండపం నుంచి వెలుపలకు వస్తారు. హేరా పంచమి రోజున శ్రీదేవి కూడా ఈ ద్వారం గుండానే తిరిగి వస్తారు. ద్వారం పైభాగం మధ్యలో మహాలక్ష్మి, ద్వారం ఎడమ వైపున బ్రహ్మ, కుడి వైపున మహా దేవుడు (శివుడు) కొలువై ఉన్నారు. బ్రహ్మ, శివుల పైన నవగ్రహాలు చోటు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
కృష్ణ, బలరాముల అవతారంలో..
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో బుధవారం జగన్నాథుడు కృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. కొన్నిచోట్ల బలరామునిగా దర్శనమిచ్చారు. గురువారం కల్కి అవతారంతో మొత్తం దశవతారాలు ముగుస్తాయని సేవాయత్ ప్రదీప్ పండా, సంజుపాఢి తెలిపారు. రాజవీధిలోని శ్రీమందిరం వద్ద గురువారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని జగన్నాధ మందిర పునర్నిర్మాణ కమిటీ తెలియజేసింది.
రామావతారంలో జగన్నాథుడు
రాయగడ: రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా గుండిచా మందిరంలో పూజలందుకుంటున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రా దేవతామూర్తుల్లో ఉన్న స్వామివారు బుధవారం రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బిసంకటక్‌లోని దుర్గి జగన్నాథ మందిరంలో రామబలరామ అవతారాల్లో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.


