జయపురం: జయపురంలో జరుగుతున్న జగన్నాథ్ రథోత్సవంలో పాల్గొంటున్న భక్తులకు స్థానిక శివసాయి సేవా గ్రూపు మహిళలు విశేష సేవలు అందిస్తున్నారు. రోజూ గుండిచా మందిరానికి వెళ్లి మందిర పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారు. అలాగే భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు.
దారు దేతలను దర్శించేందుకు వచ్చే వందలాది మంది భక్తలు రద్దీని క్రమబద్ధీకరణ చేయటం, భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. శివ సేవా కార్యక్రమాల్లో జయపురం శివసాయి సేవా గ్రూపునకు చెందిన 40 మంది మహిళా సభ్యులు క్రమశిక్షణతో సేవలందిస్తూ అభినందనలు అందుకుంటున్నారు.


