మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలో ఒకప్పుడు మావోయిస్టుల సమావేశాలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పడు అదే ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు గ్రామస్తులే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు చిత్రకొండ సమితి కపాతుట పంచాయతీ ఒర్రగెల్ గ్రామంలో వెలుగు చూశాయి. గ్రామంలో నాలుగేళ్ల కిందట జియో మొబైల్ టవర్‌ను 13 గ్రామాలకు నెట్‌వర్క్ సౌకర్యం అందించాలి అనే ఉద్దేశంతో నిర్మించారు. కానీ ఇప్పటికీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఒక్క ఫోన్ కాల్ చేయాలన్నా సరిహద్దున ఉన్న ఆంధ్ర నెట్‌వర్క్ పైనే ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ సేవలు పొందాలంటే జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు.


