పవర్‌ హౌస్‌ మూసివేత | - | Sakshi
Sakshi News home page

పవర్‌ హౌస్‌ మూసివేత

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

బలిమెల.. పవర్‌ హౌస్‌ మూసివేత

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
బలిమెల..

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బలిమెల పవర్‌ హౌస్‌ను సోమవారం నుంచి మూసివేశారు. రుతు పవనాలు సరిగ్గా లేకపోవడం, రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గడం కారణంగా ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ బలిమెల జల విద్యుత్‌ ప్రాజెక్టు పవర్‌ హౌస్‌ను ఆదివారం అర్ధరాత్రీ నుంచే నిలిపివేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి కోసం నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో నీటి పారుదల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పోటేరు నీటిపారుదల ప్రాజెక్టు చీఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌ త్రూపా కుమార్‌ పాత్ర తెలిపిన వివరాలు ప్రకారం బలిమెల రిజర్వాయర్‌ నీటిమట్టం పూర్తి స్థాయి 1,516 అడుగులతో పోలిస్తే 1,455.60 అడుగులకు పడిపోయింది. ప్రత్యక్ష నీటి నిల్వ కూడా కేవలం 13.13 శాతమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నీటి మట్టం 1,462.60 అడుగులు, ప్రత్యక్షనిల్వ 19.94 శాతం ఉండేది. ఈ సంవత్సరం క్యాచ్‌మెంట్‌ ప్రాంతంలో కేవలం 519 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 259 మిల్లీమీటర్లు తక్కువ. ఎల్‌ నినో ప్రభావం, సగం రుతుపవనాల వర్షాలు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఓహెచ్‌పీసీ పవర్‌ హౌస్‌ మూసివేత

నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు బలిమెల ప్రాజెక్టుకు నీటి విడుదలను వెంటనే నిలిపివేశారు. ఓహెచ్‌పీసీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ దుర్గా ప్రసాద్‌ పట్నాయిక్‌ మాట్లాడుతూ రిజర్వాయర్‌ స్థాయిని కాపాడటానికి నీటి విడుదలను నిలిపివేశామని తెలిపారు. ఖరీఫ్‌కు నీరందించే ఉద్దేశంతో నీటి సరఫరాను 40వేల క్యూసెక్కులకు పరిమితం చేశారు. ప్రస్తుతం జలపూట్‌ రిజర్వాయర్‌ నుంచి సమారు 600క్యూసెక్కుల నీరు వస్తోంది. శనివారం రాత్రి నాటికి దీన్ని 2,000 క్యూసెక్కులకు పెంచాలని నీటి పారుదల శాఖ అభ్యర్థించింది. మాచ్‌ఖండ్‌ పవర్‌హౌస్‌ ప్రమాదం తర్వాత జలపూట్‌ నుంచి నీటి విడుదల నిలిపివేయడం కూడా బలిమెలలో నీటి కొరతకు ఒక కారణమని అంటున్నారు.

గుడారిలో వినతుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement