● మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ఆరా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ హోదాలో నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్‌లు ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రికి వచ్చి రోగుల వార్డులో ప్రవేశించి అందుతున్న వసతుల గురించి ఆరాతీశారు. మందుల నిల్వ, సిబ్బంది ఖాళీల పరిస్థితి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వాహణను పరిశీలించారు. ఆస్పత్రిలో కల్పించాల్సిన వసతులపై వైద్య సిబ్బందితో కలిసి చర్చించారు.


