పర్లాకిమిడి: రథయాత్రకు సరిహద్దు ప్రాంతాలైన పాతపట్నం, కొరసవాడ, బొంతు, శ్రీకాకుళం, చాపర, పలాస నుంచి పర్లాకిమిడికి రావడంతో మెడికల్ జంక్షన్, రాజవీధి, పాతపట్నం రోడ్డులో ఆదివారం ట్రాఫిక్ సమస్య ఎదురైంది. ట్రాఫిక్‌లో అంబులెన్సులు కూడా మెడికల్‌కు చేరుకోలేక పోయాయి. గుండిచా మందిరం వద్ద దర్శనం కోసం కనీసం 20 వేల మంది గుమిగూడారు. క్యూ ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా అగ్నిమాపక దళం జంక్షన్ వద్ద పోలీసులు బైక్‌లు రాకుండా చేయడంతో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఊరిలో ఎటుచూసినా బైక్‌లు, ఆటోలు పార్కింగ్ లేనందున అనేక మంది రథయాత్రలో గుండిచా మందిరానికి వెళ్లలేక నానా తంటాలు పడ్డారు. శ్రీజగన్నాథుడు వరహా, నృసింహా అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు.


