జయపురం: రాష్ట్ర అమలా సంఘం మాజీ ప్రధాన కార్యదర్శిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అమలా సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి శశిభూషణ దాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యాదవ భవనంలో జిల్లా అమలా సంఘం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్ తరాశియపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి ఒడిశా అమలా సంఘం లేటర్ హెడ్‌పై తప్పుడు సమాచారం అందజేసి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది సమావేశాలకు ఆహ్వానించటం, ఎన్నికల పేరుతో వారిని రహస్యంగా ఎంపిక చేయటం, హోం శాఖ కార్యదర్శికి తప్పుడు సమాచారం అందించటం వంటి కారణాలను పరిగణలోనికి తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లా అమలా సంఘం అధ్యక్షుడు జగన్నాథ్ మఝీ, ఒడిశా అమలా సంఘం సంస్థాగత కార్యదర్శి, రాష్ట్ర కండియ సంఘ కార్యదర్శి కై ళాస సామంతరాయ్, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.


