జయపురం: జయపురం స్వచ్ఛంద సంస్థ జయపురం షోషియల్ ఎడ్యుకేషనల్ ఎన్విరోన్‌మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం జయపురం సమితి ఘొసడ గ్రామంలో నిర్వహించింది. సీవా కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మన మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు, సుస్థిరమైన ప్రగతికి చెట్లే ప్రధాన ఆధారమన్నారు. పర్యావరణం కోసం తాము నిరంతరం పని చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో 120 రకాల మొక్కలు నాటారు. సీవా సభ్యులు, జయపురం సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొని మొక్కలు నాటారు.


