● 9 మంది అరెస్టు
రాయగడ: జార్సుగుడలోని అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని బెల్పహర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌పూర్, ఉజల్‌పూర్ గ్రామాల్లో శుక్రవారం విస్కృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 722 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు తయారీకి వినియోగించే 47 క్వింటాళ్ల విప్పపువ్వును స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా సారా తయారీకి వినియోగించే 12 క్వింటాళ్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలిపారు.
రాయగడ: స్థానిక వికల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆమ మట్టి– అమ సంకల్ప్ సంయుక్తంగా సదరు సమితి పరిధిలో గల జఫాకల్‌లో శుక్రవారం బాలలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రమశిక్షణే విజయానికి తాళం చెవి అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జగదీష్ చంద్ర దొర స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డీకే మహాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలొ భాగంగా క్రమశిక్షణ, సమయపాలన, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు విస్కృతంగా వివరించారు. విద్యార్థులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు పాటించాల్సిన దినచర్య గురించి వివరించారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి విజయానికి దోహదపడుతుందని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అర్చనా పట్నాయక్, కృష్ణ ప్రియ సహాని, శశిభూషణ్ పట్నాయక్, డాక్టర్ వినోద్ చంద్ర పాత్ర, కుముద్ చంద్ర సామంతరాయ్ పాల్గొన్నారు. అనంతరం పిల్లలను ఉత్సాహపరిచేందుకు వివిధ క్రీడలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు.
బీజేపీలో పలువురి చేరిక
పర్లాకిమిడి: గజపతి జిల్లా బీజేపీలోకి వందలాది మంది సర్పంచ్‌లు, నాయిబు సర్పంచ్‌లు, బీజేడీ కార్యకర్తలతోపాటు కాశీనగర్ జెడ్పీటీసీ జోన్–1 సభ్యురాలు రోక్కం రాజ్యలక్ష్మి చేరారు. గుసాని సమితి లింగిపురం గ్రామంలో శుక్రవారం జరిగిన బీజేపీ మిశ్రణ్ పర్వ్‌కు అధ్యక్షత జిల్లా బీజేపీ అధ్యక్షుడె నవకిశోర్ శోబోరో వహించారు. బీజేపీ నాయకులు అమియ మహాపాత్రో, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ముఖ్య అతిథులు విచ్చేశారు.ముఖ్యమంత్రి మోహాన్‌చరణ్ మఝి పరిపాలనకు ఆకర్షితులై అనేకమంది గుమ్మా, కాశీనగర్, గుసాని సమితుల నుంచి బీజేడీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరామని జెడీటీసీ సభ్యురాలు రోక్కం రాజ్యలక్ష్మి అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేడీ వీడి బీజేపీలోకి నాయకులు చేరడంతో తమ పార్టీకి బలం రెట్టింపు అయిందని కోడూరు నారాయణరావు అన్నారు. ఈ మిశ్రణ్ పర్వ్‌లో సీనియర్ నాయకులు (కాశీనగర్) ఛిత్రి సింహాద్రి, సాధారణ కార్యదర్శి జగన్నాధ మహాపాత్రో, కాశీనగర్ నాయకులు రొక్కం సతీష్, పర్లాకిమిడి నియోజకవర్గం నాయకులు, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
సారాతో ఒకరి అరెస్టు
రాయగడ: నాటుసారా అక్రమ రవాణా, తయారీపై ఉక్కుపాదం మోపిన జిల్లా అబ్కారీ శాఖ అధికారులు ఈ మేరకు విస్తతంగా దాడులను నిర్వహిస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధలసామంతరాయ్ ఆదేశానుసారం సిబ్బంది పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మోటార్ సైకిల్‌పై నాటుసారాను తరలిస్తున్న ఎస్.జగన్నాథరావును పట్టుకున్నారు. అతని వద్ద 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


