కాలవైశాఖి బీభత్సం | - | Sakshi
Sakshi News home page

కాలవైశాఖి బీభత్సం

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాలోని పలు చోట్లు గురువారం రాత్రి కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో ఎంవీ 43 గ్రామంలో ఇళ్లపై చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా ఆగిపోగా.. రేకులు ఎగిరిపోయి ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కలిమెల సమితిలో కూడా పలు చోట్ల చెట్లు పడిపోయాయి. సరస్వతి శిశుమందిర్‌ స్కూల్‌పై చెట్లు పడి భారీ నష్టం వచ్చింది. కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కలిమెల సమితిలో ఉన్న గోపబంధు మహా విద్యాలయానికి వెళ్లే మార్గంలో భారీ చెట్టు కూలిపోయి రాకపోకలు స్తంభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement