పిడుగు పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగు పడి మహిళ మృతి

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మహరాజ్‌పల్లి గ్రామంలో గురువారం రాత్రి పిడుగు పడి ఎంకి మడ్కామి (35) అనే మహిళ మృతి చెందింది. ఆమె భర్త భీమ మడ్కమికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భీమా, ఎంకి ఇద్దరూ తమ పొలంలో వేరుశనగ పంటకు కలుపు మొక్కలు తీయడం కోసం గురువారం పొలానికి వెళ్లారు. అక్కడే గుడిసెలో వండుకుని తిన్నారు. సాయంత్రానికి గాలి వాన రావడంతో ముందు పిల్లలను ఇంటి వద్ద దింపడానికి భీమ బైక్‌పై వెళ్లారు. రాత్రి సామాన్లు తీసుకురావడానికి ఎంకి గుడిసె వద్దకు వెళ్లగా రాత్రి ఏడింటికి పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త భీమకు తీవ్ర గాయాలయ్యాయి. భీమ కేకలు వేయగా సమీపంలోని వారు వచ్చి ఆయను ఎంవీ 79 ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఎంకి మృతదేహానికి కలిమెల సమితి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి ఇతర కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలికి 7 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement