ఐఐటీ భువనేశ్వర్‌లో బ్లెండెడ్‌ మోడ్‌ ఎం.టెక్‌ ప్రోగ్రామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ భువనేశ్వర్‌లో బ్లెండెడ్‌ మోడ్‌ ఎం.టెక్‌ ప్రోగ్రామ్‌

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

భువనేశ్వర్‌: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) ఈవీఏసీఏడీతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) టెక్నాలజీలో బ్లెండెడ్‌–మోడ్‌ ఎం.టెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద పరిశ్రమలు తదితర రంగాల్లో పని చేస్తున్న ఇంజినీర్లు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఈవీ వ్యవస్థలు, బ్యాటరీ టెక్నాలజీ, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, వాహన అనుసంధానంలో ఉన్నత నైపుణ్యాన్ని పొందగలుగుతారు. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఈవీ ఆధారిత నైపుణ్యం గల నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ ప్రోగ్రామ్‌ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కెరీర్‌ను కొనసాగిస్తూ ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా సౌకర్యవంతమైన బ్లెండెడ్‌ మోడ్‌ నిర్మాణం, ఆన్‌లైన్‌ అభ్యాసం క్యాంపస్‌లో జరిగే ప్రత్యేక తరగతులతో అనుసంధానపరిచారు.

బ్లెండెడ్‌–మోడ్‌ ఎం.టెక్‌ ప్రవేశం ఇలా..

ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి గేట్‌ అర్హత అవసరం లేదు. విద్యా నేపథ్యం, వృత్తిపరమైన అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ బహుళ విషయాల పాఠ్యప్రణాళిక, వాహన రూపకల్పన, పవర్‌ట్రెయిన్‌ అభివృద్ధి, ఈవీలలో నియంత్రణ అంశాలు, బ్యాటరీ రూపకల్పన, నిర్వహణ, డయాగ్నోస్టిక్స్‌, ఛార్జింగ్‌ టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు మొదలైన ఈవీల యొక్క వివిధ రంగాలలో సమగ్ర జ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్‌. ఈ ఏడాది జూలై 24న ప్రారంభం కానుంది. వినూత్న, సరళమైన అభ్యాస నమూనా ద్వారా ఈవీ రంగంలో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించే పరిశ్రమ, సంబంధిత రంగాల నుండి అర్హులైన అభ్యర్థుల కోసం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement