రాయగడ: విద్యతో పాటు విద్యార్థులకు విలువలు కూడా ఎంతో అవసరమని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో ఉన్న జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాఽధించిన సీకృతి రథ్, డొలినాయక్, బిరూపాక్ష సాహు, భాగ్యదీప్ స్వయి, దేవేంద్ర కౌసల్య, దేవేతి హికక, లిపున్ దిబ్రిసింగ్, రోషన్ కుమార్ నాయక్, ఈసాన్ బలియార్‌సింగ్, డి.విశ్వజీవన్ పాత్రో సహా పది మంది ప్రతిభావంతులలైన విద్యార్థులకు సత్కరించారు. సంఘం అధ్యక్షుడు దేవేంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమతి విద్యాశాఖ అధికారి గణేష్ సబర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హృషికేష్ జాలి, తదితరులు పాల్గొన్నారు.


