పర్లాకిమిడి: స్థానిక మహారాజా కళాశాల సమీపంలో జిల్లాస్థాయి మామిడిపండ్ల మేళా, మన గ్రామ మామిడిపండ్ల రుచులుతో స్టాళ్లను డీఆర్‌డీఏ ఆధీనంలో ఉన్న ఓర్మాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు. మేళాను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ము ఖ్యఅతిథిగా విచ్చేసి శుక్రవారం ప్రారంభించగా, గౌరవ అతిథులుగా జిల్లా పరిషత్తు చైర్మన్ గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఏడీఎం మునీంద్ర హానగ, ఓర్మాస్ డిప్యూటీ సీఈ.వో ఆశిష్ రవుళో, డీపీఎం టిమోన్ బోరా, జిల్లా పరిషత్తు సీడీవో దయామయ పాఢి తదితరులు విచ్చేసి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేంద్రియ పండ్లతోటల్లో పండిస్తున్న మామిడి పండ్లను తిలకించి వాటి రుచులను ఆస్వాదించారు. స్టాళ్లను మిషన్ శక్తి, స్వయం సహాయక మహిళా గ్రూపులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాశీనగర్, గుసాని సమితిల్లో పండిస్తున్న మామిడి తోటల్లో బంగినపల్లి, చెరుకు రసాలు, ఆమ్రపల్లి, దోసెరీ రకాలను అమ్మకానికి ఉంచా రు. కిలో మామిడిపండ్లు రూ.40 చొప్పున్న అమ్ము తున్నారు. అలాగే అనాసపండ్లు ఒకటి రూ.60లు (క్వీన్ రకం) అమ్ముతుండటం విశేషం. రెండురో జుల పాటు ఈ మామిడిపండ్ల స్టాల్స్ కాలేజ్ జంక్షన్ వద్ద వుంటాయని అధికారులు తెలియజేశారు.


