● విశ్వబసు సవర సంస్కృతి
ఆధ్వర్యంలో నిరసన
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై అసాంఘిక శక్తులు చొరబడి ప్రకృతి ఒడిలోవున్న ఖనిజాలు, గ్రా నైట్ తవ్వకాలు, ఔషధమొక్కలు దోపిడీకి గురౌతుందని, అలాగే ఆదివాసీల హక్కులను హరించివేసి అ సహన వాతావరణం సృష్టిస్టు తున్నారని, వీటిని బంద్ చేయాలని కోరుతూ విశ్వబసు సవర సంస్కృతి, మహేంద్రగిరి సురక్షా మంచ్ పేరిట కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. జూన్ ఒకటి నుంచి మహేంద్రగిరి పై జరుగనున్న మేళాకు తాము వ్యతిరేకం కాదని ఆదివాసీ సురక్షా మంచ్ నాయకులు తెలియజేశారు. గజపతి స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ సమితి మాజీ చైర్మన్ ధనేశ్వర్ భుయ్యాన్ ఆధ్వర్యంలో జరిగింది. ర్యాలీలో కోయిపూర్, బారో ఘోరో, మహేంద్రగిరి చుట్టుపక్కల వున్న గ్రామప్ర జలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం పలు డి మాండ్లతో కూడిన వినతిని జిల్లా కలెక్టర్ అక్షయ సు నీల్ అగర్వాల్‌కు ధనేశ్వర భుయ్యాన్ అందజేశారు.


