మహిళా దొంగలు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళా దొంగలు అరెస్టు

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

భువనేశ్వర్‌: బిచ్చగాళ్లగా రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల నుంచి బంగార వస్తువులను దొంగలింస్తున్న మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్ద రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్‌) వారిని అరెస్టు చేసింది. వారి నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి దొంగిలించిన బంగారం రైలులో తరలిస్తుండగా ఆరెస్టు చేసినట్టు ఆర్పీఎఫ్‌ అధికారులు బుధవారం వెల్లడించారు.

రాజ్యసభ ఉపఎన్నికకు

ఉత్తర్వులు జారీ

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్‌ బుధవారం జారీ చేసింది. బిజూ జనతా దళ్‌ అభ్యర్థి రాజీనామా చేసిన తర్వాత దేబాశిష్‌ సామంత్రాయ్‌ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అతడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జూన్‌ ఒకటో తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఎనిమిదో తేదీన నామినేషన్ల దాఖలకు గడువు ముగిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్‌ 11గా ప్రకటించారు. అవసరమైతే 18వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాులుగు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీఐ తెలిపింది.

పోలీసుల ఔదార్యం

భువనేశ్వర్‌: శాశ్వతంగా కన్నుమూసిన కన్న తల్లి అంత్యక్రియలకు బిడ్డలు ముందుకు రాలేదు. సోదరుల మధ్య కలహాలతో తల్లి మృతదేహాన్ని తాకేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అంతిమ యాత్ర అయోమయంగా పరిణమించింది. సుమారు 10 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. బాలాసోర్‌ జిల్లా సంతోష్‌పూర్‌ పంచాయతీ లోకనాథ్‌పూర్‌లో ఈ హదయ విదారక పరిస్థితి చోటుచేసుకుంది.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

రాయగడ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మాఝిని దోషిగా నిర్ధారిస్తు రాయగడ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి బుధవారం కీలక తీర్పును వెల్లడించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తన తీర్పులో పేర్కొన్నారు. జిల్లాలోని కాసీపూర్‌ సమితి టికిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 సెప్టెంబర్‌ మూడో తేదీన నమోదైన కేసు బుధవారం విచారణకు వచ్చింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలు, వాదనలు పరిశీలించిన కోర్టు నిందితుడు కృష్ణ మాఝిని దోషిగా పరిగణలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా కింద నిందితుడు రూ. 20 వేలు చెల్లించాలని, చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

10 వేల లీటర్ల నాటుసారా స్వాధీనం

పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్‌.ఉదయగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో పుత్రుపడ గ్రామపంచాయతీ తుమన్నా గ్రామంలో పోలీసు, ఎకై ్సజు అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 10 వేల లీటర్ల ఐడీ. లిక్కర్‌, వంటసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేసి ఆర్‌.ఉదయగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు దర్యాప్తు చేస్తున్నట్టు ఆర్‌.ఉదయగిరి ఐఐసీ కల్పలతా ప్రధాన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement