పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో సర్వజననీ సేవా అధికార చట్టంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఓ.ఆర్.టి.పి.ఎస్.ఏ డిప్యూటీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సరితా కనుంగో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులతోపాటు ఒడిశా ప్రజాసేవల చట్టం, హక్కుల అధికారి శ్రేయా పాత్రో, రిజిస్ట్రార్ డాక్టర్ అనితాపాత్ర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సేవా హక్కుల చట్టం, వాటి నిబంధనలను ప్రాజెక్టు కో ఆర్డినేటరు సరితా కనుంగో స్టూడెంట్ వలంటీర్లు, ఫ్యాకల్టీ సభ్యులకు ఆవగాహన కల్పించారు. దాదాపు 200 మంది జాతీయ సేవా వాలంటీర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్ర, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ రితీష్ కుమార్, డీన్(అడ్మిన్ ) డాక్టర్ ఎస్.పి.నందా, డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నిహాల్.ఆర్ తదితరులు పాల్గొన్నారు.


