జయపురం జమాల్ వీధిలోని శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కల్యాణ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవంలో హిందూ సంప్రదాయంగా శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పురోహితులు నిర్వహించారు. ముత్తైదువులు పసుపు దంపుడు, అక్షింతలు పంపిణీ, మంగళ వాయిద్యాలతో వెళ్లి బంగారు శతిమానాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. వివాహ మహోత్సవంలో వారణాశి సత్యనారాయణ, సుంకరి ఈశ్వరరావు దంపతులతో పాటు పదిమంది దంపతులచే ఆలయ పూజారులు గన్నవరపు కోటేశ్వరవర ప్రసాద్, శర్మ, ఉలిమిరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జయపురం


