మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మాంగిపల్లి గ్రామంలో భూవివాదాలతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ దాడిలో బుధినాధ్ కబాసీ గాయపడ్డాడు. అతను మహువా పూలు ఏరడానికి అడవికి వెళ్లాడు. అక్కడ కొందరు గ్రామస్తులు బాణంతో అతడిపై దాడి చేశారు. దీంతో ఆయన రక్తమోడుతూ పరుగులు పెట్టుకుంటూ గ్రామానికి వచ్చేశాడు. కుటుంబ సభ్యులు కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయన భార్య సుకాంతి కబాసీ కలిమెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన భీమా కబాసీ, లక్ష్మణ్ కబాసీ, సోమనాధ్ కబాసీపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్నాథ్ సాగర్ పరిసరాల్లో నిర్మాణాలపై సర్వే
జయపురం: జయపురంలో చారిత్రాత్మక జగన్నాథ్‌సాగర్ పునర్ నిర్మాణ పనులతోపాటు సాగర్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ నుంచి సీనియర్ బృందం సర్వే జరిపి ఆయా పనులకు వ్యయపు అంచచా రిపోర్టు సమర్పించేందుకు కంట్రాక్ట్ తీసుకుంది. ఆ సంస్థ నుంచి వచ్చిన సీనియర్ సర్వేయర్లతో పాటు జయపురం మున్సిపాలిటీ జూనియర్ ఇంజినీర్ హేమంత పండ, నిర్మాణ విభాగ అధికారి దేవప్రసాద్ నాయిక్ పాల్గొన్నారు. జగన్నాథ్ సాగర్ ఒకవైపున పైపులతో ప్రహరీ నిర్మాణం, మొక్కలు నాటటం మొదలగు నిర్మాణాలపై సర్వే నిర్వహించి వాటిని తక్కువ ఖర్చుతో పూర్తి చేసేలా నివేదిక తయారుచేస్తారని మున్సిపల్ ఇంజినీర్ అజయ జాని వెల్లడించారు. జయపురం జగన్నాథ్ తవ్వకాలు, మట్టి తొలగింపు, పరిశుభ్రత పనులకు రూ. 16 కోట్లు, సాగర్ పరిసరాల అభివృద్ధి పనులకు రూ. 6 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెప్పారు.
బడ్జెట్‌పై అవగాహన
మల్కన్‌గిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మల్కన్‌గిరి జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో మంగళవార బడ్జెట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పరిపాలనా పారదర్శకతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ‘మన బడ్జెట్ తెలుసుకుందాం’కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభంలో జిల్లా పంచాయతీ అధికారి సరోజ్ కుమార్ ప్రధాన్ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు వివరించారు, బడ్జెట్ తయారీ నుంచి అమలు వరుకు ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే విషయంపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతి పథకం విజయవంతం కావడానికి బడ్జెట్ నిర్వహణ చాలా అవసరమని అన్నారు. ప్రజలకు బడ్జెట్‌పై అవగాహన ఉంటేనే తమ ప్రాంత సమస్యలు అభివృద్ధి కోసం డిమాండ్ చేయగలరన్నారు. డిప్యూటీ కలెక్టర్ బిమల్ కుమార్ లెంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.


