పర్లాకిమిడి: గుసాని సమితి జాజిపురం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మా నికిటి భవానీ అమ్మవారు గ్రామదేవత ఉత్సవాలను ఆదివారం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతి రావు సందర్శించారు. ఐదేళ్లకు ఒకసారి జాజిపురంలో నిర్వహించే అమ్మవారి పండుగ అత్యంత ఆడంబరంగా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ ఒకటితో ముగుస్తున్న ఈ అమ్మవారి పండుగలలో సాయంత్రం వేల ఒడియా చలన చిత్ర గాయనీగాయకులు శక్తిమిశ్రా, టి.శౌరీ సంగీత కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామప్రజలు విచ్చేశారు.
సాయంత్రం నికిటి భవానీ అమ్మవారు జాజిపురం గ్రామసందర్శనకు వెళ్లిన సమయంలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శించుకున్నారు.


