జూన్‌ ఒకటి నుంచి గ్రామదేవత ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

జూన్‌ ఒకటి నుంచి గ్రామదేవత ఉత్సవాలు

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

రాయగడ: రాయగడ పట్టణ ప్రజల ఆరాధ్యాదైవం, గ్రామదేవతగా పూజలందుకుంటున్న భైరవీధిలో వెలసియున్న బురదల పోలమ్మ వార్షిక ఉత్సవాలు జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు మందిరం ప్రాంగణంలో ఆదివారం పట్టణ ప్రముఖులు సమావేశమై ఉత్సవాల తేదీని ఖారారు చేశారు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు జూన్‌ పదో తేదీతో ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

సాహిత్యం, నృత్య బంధం బలమైనది

భువనేశ్వర్‌: పుస్తకాలు, పాఠకులు సమాజంలో ఒక భాగమని, సాహిత్యంలో నృత్యం మేళవింపు పాఠకులను విభిన్నంగా ఆకట్టుకుంటుంది. సాహిత్యం, నృత్య బంధం విడదీయరానిదని కటక్‌ నగర పాలక సంస్థ మేయరు సుభాష్‌ సింగ్‌ తెలిపారు. కటక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కటక్‌ మహానది తీరం బాలి జాతర మైదానంలో నిర్వహించిన తొలి పుస్తక ప్రదర్శన కటక్‌ సాహిత్య సరోవర్‌–2026 కార్యక్రమంలో మేయరు ప్రసంగించారు. ఈ వేదికపై ఒడియా భాష, సాహిత్యం అధ్యాపకుడు, ఒడిస్సీ నృత్యకారుడు డాక్టర్‌ చిత్తరంజన్‌ సహాని దర్శకత్వం, డాక్టర్‌ సంగీత సాహు సమన్వయంతో గణేష్‌ వందన, జయదేవ గీతా గోవింద ఆధారంగా ప్రదర్శించిన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

కంటైనర్‌లో చెలరేగిన మంటలు

భువనేశ్వర్‌: మయూర్‌భంజ్‌ జిల్లా బరిపద 18వ నంబరు జాతీయ రహదారి బెత్తొనటి సమీపంలో కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో డ్రైవర్‌ సిలిండర్‌తో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తు ఈ వాహనంలో వంట చేస్తున్న డ్రైవర్‌, హెల్పర్‌ ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను నివారించారు.

పూరీ కారాగారంలో ఖైదీ అనుమానాస్పద మృతి

భువనేశ్వర్‌: పూరీ కారాగారంలో ఆదివారం విచారణలో ఉన్న ఖైదీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు గుర్తించారు. జైలు స్నానపు గదిలో ఆయన శవం వేలాడుతున్నట్లు గుర్తించారు. మృత ఖైదీ పూరీ జిల్లా సాక్షి గోపాల్‌ దహన కుంభార్‌పడా నివాసి దీప్తి రంజన్‌ స్వంయిగా గుర్తించారు. అత్యాచార కేసులో అరెస్టు అయిన తర్వాత అతను 2023 నుంచి ఈ జైలులో ఖైదీగా ఉన్నాడు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆది వారం ఉదయం పూరీ – కోణార్క్‌ రోడ్డులోని జైలు ప్రాంగణంలో విచారణ ఖైదీ మృతదేహం లభ్యమైంది. అనంతరం మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. బాత్‌రూమ్‌లో తన టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడినట్లు మృతుని కుటుంబానికి తెలియజేశారు. ఈ సమాచారం అందడానికి కాసేపు ముందు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన సోదరితో మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. త్వరలో అతని బెయిల్‌ కోసం న్యాయ స్థానానికి ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవడం కలచి వేస్తుందని కుటుంబీకులు భోరుమన్నారు. ఈ ఘటన నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement