భారీగా గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ ఎకై ్సజ్‌ సిబ్బంది 120 కేజీల గంజాయిని శుక్రవారం పట్టుకున్నారు. నందపూర్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ కుమార్‌ సాహు నేతృత్వంలో బొయిపరిగుడ ఎకై ్సజ్‌ అధికారి అజయ్‌ కుమార్‌ నాయిక్‌, ఏఎస్‌ఐ సరోజ్‌ కుమార్‌ బెహర, కానిస్టేబుల్‌ రఘునాథ్‌ సాంత, మహేష్‌ కుమార్‌ బెహరలు గంజాయి మాఫియాపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా గంజాయి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బొయిపరిగుడ సమితి చిపాకూర్‌ గ్రామ పంచాయతీ ఝిలోగుడ గ్రామంలో ఒక వ్యక్తి గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు బస్తాల్లో నింపుతున్న

సమాచారం నందపూర్‌ ఎకై ్సజ్‌ అధికారికి వచ్చింది. దీంతో వెంటనే ఒక బృందం ఝిలోగుడ గ్రామానికి బయల్దేరింది. సనియ అండాల్‌ అనే వ్యక్తి రహదారిలో గంజాయి బస్తాల్లోకి నింపుతుండగా దాడి చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి 120 కేజీల గంజాయితో పాటు బొయిపరిగుడ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది గురువారం రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఒక మహిళతో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఐఐసీ కేకేబీకే కుహరో తెలిపిన వివరాల మేరకు.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు గుణుపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పోలీస్‌ సిబ్బంది తనిఖీలను నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక బృందాన్ని ఆపి వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో అరైస్టెన నిందితులు గజపతి జిల్లాల్లోని ఆర్‌.ఉదయగిరి ప్రాంతానికి చెందిన బబులి నాయక్‌, ఆకాష్‌ కొరడగా గుర్తించగా.. మరో ముగ్గురు బీహార్‌కు చెందిన మహాంతమనియార్‌ ప్రాంతంలోని చందాదేవి, రాయిన్‌పఖొరి గ్రామానికి చెందిన ఛొటు సాని, రాజు కుమార్‌లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, రూ.11 వేల నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement