హత్య కేసులో 9 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో 9 మంది అరెస్టు

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

కొరాపుట్‌: పిల్లల దొంగ అనే నెపంతో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటనలో 9 మంది అరెస్టు అయ్యారు. శుక్రవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్ర పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ సంబిత్‌ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈనెల 16వ తేదీన కెందుగుడ గ్రామ సమీపంలోని చికిల్‌పొదర్‌ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి (57) సంచరిస్తున్నాడు. అతను పిల్లల దొంగ అనే అనుమానంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనని స్థానిక యువకులు సెల్‌ఫోన్ల లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇది చూసిన పోలీసులు వీడియోలు ఆధారంగా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఈ ఘటనకి పాల్పడిన దేవేంద్ర కుమార్‌ బోత్ర, మాన్‌సింగ్‌ బోత్ర, పరమానంద బోత్ర, మచింద్ర బోత్ర, గధాదర్‌ పట్లి, డొము బోత్ర, సితారం బోత్ర, ధనుపతి రంధారి, ఫకీర్‌ మెహన్‌ నాయక్‌లను అరెస్ట్‌ చేసి జైలుకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement