జయపురంలో ప్రేమచంద్ర చౌదరి పర్యటన | - | Sakshi
Sakshi News home page

జయపురంలో ప్రేమచంద్ర చౌదరి పర్యటన

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

జయపురం: మత్స్య, పశు సంపద వికాస విభాగ కార్యదర్శి, కొరాపుట్‌ జిల్లా నోడల్‌ కార్యదర్శి ప్రేమచంద్ర చౌదరి జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మ సమితిలో శుక్రవారం పర్యటించారు. దీనిలో భాగంగా బొరిగుమ్మ సమితి నువాగాం ఎస్‌ఎస్‌డీ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయనతో పాటు కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్యభాను మహాజన్‌, సీడీవో బేణూధర్‌ శబర్‌, జయపురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ తృప్తి బరాయి, జిల్లా మంగళ అధికారి సునీల్‌ కుమార్‌ తండి, జిల్లా విద్యాధికారి కరుణ కుమార్‌ భొయె తదితరులు ఉన్నారు.

ఉపకార వేతనాలకు

రూ.2 లక్షల విరాళం

పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాల 1973 అల్యుమినీ బ్యాచ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాధాకాంత భుయ్యాన్‌ను శుక్రవారం కలిసి విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 లక్షల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. ప్రిన్సిపాల్‌ను కలిసినవారిలో విశ్రాంత ఉత్కళ్‌ బ్యాంకు అధికారి అభిమన్యు నాయక్‌, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి.సత్యనారాయణ రాజు, వి.సోమలింగం, కామేశ్వర్‌ బిశ్వాల్‌, ఎం.ఉమామహేశ్వరరావు, కె.నాగేశ్వరరావులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement