కవి శ్రీనివాసరావుకు జాతీయ పురస్కారం
జయపురం: జయపురం తెలుగు కవి సింహాద్రి శ్రీనివాసరావుకు మరో జాతీయ పురస్కారం లభించింది. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి షోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లు సంయుక్తంగా విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్ష్ ఆడిటోరియంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక పట్టాభిషేకంలో సాహితీ కార్యక్రమం నిర్వహించాయి. జాతీయ పురస్కారం ‘సేవా ప్రపూర్ణ’ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఒడిశా రాష్ట్రంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నందుకు జాతీయ పురస్కారం ‘సేవా ప్రపూర్ణ’తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, శ్రీశ్రీ కళా వేదిక మహిళా అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణరావు, కన్వీనిర్ పార్ధసారథి, భక్త రామదాస్ పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాస్, శ్రీనాథ్ కవి వంశానికి చెందిన కావూరి శ్రీనివాస శర్మ, ఏనుగుల లక్ష్మణ కవి వంశానికి చెందిన శివ ప్రసాద్ తదితర కవులు పాల్గొన్నారు. శ్రీనివాసరావుకు జితీయ సేవా ప్రపూర్ణ పురస్కారం లభించినందుకు స్నేహితులు, మితృలు సాహితీప్రియులు అభినందనలు తెలిపారు.


