పెరిగిన విమాన చార్జీలు
జయపురం విమానాశ్రయంలో విమానం
జయపురం: కేంద్ర ప్రభుత్వం విమాన చార్జీలు పెంచడంతో బహుళ ఆదివాసీ వెనుకబడిన కొరాపుట్ జిల్లా జయపురం నుంచి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు వెళ్లే విమాన చార్జీలు గణనీయంగా పెరిగాయి. ఒకేసారి దాదాపు ఆరు వందలను నుంచి రూ.1,000ల వరకు చార్జీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు జయపురం – భువనేశ్వర్ చార్జీలు రూ.3,674లు ఉండగా.. శుక్రవారం నుంచి చార్జీలు రూ.4.620లకు పెంచారు. అలాగే జయపురం – విశాఖపట్నం చార్జీ రూ.2,420ల ఉండగా.. రూ.3,040లకు పెరిగింది.


