శిథిలమైన ఆర్‌అండ్‌బీ వంతెన | - | Sakshi
Sakshi News home page

శిథిలమైన ఆర్‌అండ్‌బీ వంతెన

Jan 3 2026 8:00 AM | Updated on Jan 3 2026 8:00 AM

శిథిలమైన ఆర్‌అండ్‌బీ వంతెన

శిథిలమైన ఆర్‌అండ్‌బీ వంతెన

ఆందోళనలో ప్రజలు

పర్లాకిమిడి: మోహనా–అడవ, పాణిగండ రోడ్డులోని మూడు స్పాన్ల వంతెన శిథిలావస్థకు చేరింది. 72 ఏళ్ల క్రితం నిర్మించిన మోహనా వంతెన రోడ్లు భవనాల శాఖ నిర్లక్ష్యంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే స్థితిలో ఉంది. మలస్‌పదర్‌ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నీరు బోడోనదిగా మారి తిన్నగా హారభంగి డ్యాంలో కలుస్తున్నది. అయితే ఈ వంతెన వద్ద మోహనా ప్రజా ఆరోగ్య సిబ్బంది, బీడీవో అధికారులు సరైన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టకపోవడంతో స్థానికులు వంతెన వద్ద చెత్తను వేస్తున్నారు. అటు బరంపురం, రాయగడ జిల్లాలకు కలుపుతూ వస్తున్న ఈ వంతెనకు అధికారులు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో స్థానికులు దుర్ఘంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మోహనా రోడ్లు భవనాల శాఖ ఇంజినీరు శాఖ తగు చర్యలు చేపట్టి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement